TDF History
About TDF – India
నిత్య చైతన్యశీలమైన సమాజం చేతన నిరంతరం జ్వలిస్తూనే ఉంటుంది, అనాదిగా తెలంగాణ సారస్వత, వారసత్వ, చారిత్రక నేపథ్యం దీన్ని నిరూపిస్తూనే ఉంది, ఒకే జాతి, ఒకే ప్రాంతం, ఒకే యాసగా ఖండాంతరాల్లో ఎక్కడున్నా అంతర్లీనంగా మనం, మనకోసం అని పరితపిస్తూనే ఉంటుంది. అలాంటి తపన కలిగిన తెలంగాణ బిడ్డల ఆలోచనల్లోంచి ఉదయించిందే టీడీఎఫ్. 1998లొ ప్రోపెసర్ జయశంకర్ సారథ్యంలో అమెరికా వచ్చిన ప్రతినిధి బ్రుందం నీళ్లు, నిధులు, నియామకాలు, విద్యా, ఉద్యోగాల్లో సీమాంద్ర పాలనలో ఎదురౌతున్న వివక్షతలు, అంతిమంగా రాజ్యాధికారం, స్వయం పాలనే వీటికి పరిష్కారాలుగా పేర్కొన్న సమయంలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఏర్పాటుకు ప్రేరణగా నిలిచింది. 1999లో అమెరికాలోని న్యూయార్క్ వేదికగా తెలంగాణ వలస పాలన విముక్తి, తెలంగాణ ప్రజలకు నిరంతరం అండగా ఉండడం కోసం ప్రవాస తెలంగాణ బిడ్డలు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరాన్ని ఏర్పాటు చేసారు. తొలి దశ ఉద్యమం తర్వాత ప్రజల గుండెల్లో మాత్రమే గూడుకట్టిన తెలంగాణ స్వరాష్ట్ర కాంక్షని రగిలించి, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల్ని సవివరంగా వివరించి వారిని ఉద్యమ కార్యోన్ముఖులుగా చేసే ప్రయత్నంలో బాగంగా ఆలోచనల కలబోతగా, థింక్ టాంక్ గా ఉండాలన్న సదాశయంతో ఏర్పడింది టీడీఎఫ్. నాటి నుండి ఎలాంటి లాబాపేక్ష లేకుండా తెలంగాణ ప్రజల కోసం వారి మేలు కోసం నిరంతరం పనిచేస్తూనే ఉంది. ఈ క్రమంలో ముందుగా భావజాల వ్యాప్తి కోసం తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల వాస్తవాలతో విస్త్రుత సమాచారాన్ని ప్రజల ముందు ఉంచడం కోసం అప్పుడప్పుడే అందుబాటులోకి వస్తున్న ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకొని www.telangana.org పేరుతో వెబ్సైట్ అందుబాటులోకి తెచ్చింది టీడీఎఫ్. యాహు గ్రూప్ ద్వారా అందరినీ ఒకే వేదికమీదికి తీసుకొచ్చి సమాచార వ్యాప్తిని చేసింది. టీడీఎఫ్ కార్యక్రమాలను విస్త్రుతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి 1999 ఎన్నికల్లో శ్రీరాంసాగర్, ఎస్ఎల్బీసీ పూర్తి, విద్యా, ఉద్యోగాల్లో, నిధుల్లో మనవాటా కోసం పోరాటం చేసిన వారికే ఓటేయాలని తెలంగాణ ప్రజలకు విజ్ణప్తి చేస్తూ వలస పాలకులపై ఒత్తిడి తెచ్చే విదంగా వార్తా పత్రికల్లో ప్రకటనలు ఇచ్చింది టీడీఎఫ్. అనంతరం 2000 సంవత్సరం అట్లాంటాలో సమైక్య వాధుల ఆదిపత్యం ఉండే ఆటా వేదికపై తెలంగాణ గళాన్ని భలంగా విన్పించింది, అంతటితో ఆగకుండా ప్రోపెసర్ జయశంకర్, బియ్యాల జనార్థన్ రావు, ఇతర ఓయూ, కేయూ ప్రోపెసర్లతో అమెరికా వ్యాప్తంగా తెలంగాణ అంశంపై సభలు, సమావేశాలు నిర్వహించింది. అదే సంవత్సరం చివర్లో ప్రాంతీయ పరిస్థితులపై విస్రుతమైన అవగాహన కోసం టీడీఎప్ ప్రత్యేక బ్రుందాన్ని తెలంగాణ వ్యాప్తంగా పర్యటించడం కోసం పంపించింది. విశ్వవిద్యాలయాల ప్రోపెసర్లు, 1969 ఉద్యమకారులను కలిసి చర్చించింది, చుట్టు ముట్టూ నీరున్నా, నిరంతర జలదారలతో జీవనధులు ప్రవహిస్తున్నా తెలంగాణ ఎడారిలో ఎందుకుందనే ప్రశ్నను లేవనెత్తింది టీడీఎఫ్, 2001లో అమెరికాలోని 50కి పైగా ప్రధాన నగరాల్లో తెలంగాణ వారినందరినీ ఏకం చేసేలా సమ్మర్ క్యాంపులో తెలంగాణ ప్రతీకైన బతుకమ్మ వేడుకల్ని ఘనంగా నిర్వహించింది తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం, తదనంతరం ఖండతరాల్లో బతుకమ్మ గుభాళించిందంటే అతిశయోక్తి కాదు. అలా వరుసగా ప్రవాస తెలంగాణీయులతో కార్యక్రమాలు రూపొందించుకుంటూ దిన దినం సంస్థాగతంగా టీడీఎఫ్ బలపడ్తూనే తెలంగాణాన్ని ఆలపించింది. 2004 ఎన్నికల్లో సైతం పత్రికలు, మీడియాల్లో వలసవాద పార్టీలకు వ్యతిరేకంగా నాటి వలస మీడియా అడ్డంకుల్ని అధిగమించి ఆసక్తి రేకెత్తించేలా ప్రకటనలు ఇచ్చింది టీడీఎప్. తెలంగాణ కన్నీటి కథ పేరుతో నీళ్ల సారు విద్యాసాగర్ రావు గారితో ప్రత్యేక డాక్యుమెంటరీ రూపొందించి ప్రసారం చేసింది. దీనికి విశేష స్పందన లబించింది. 2006లో తెలంగాణ రెఫరెండంగా జరిగిన కరీంనగర్ ఉపఎన్నికల్లో టీఢీఎప్ బావజాల వ్యాప్తి కోసం విశేష క్రుషి చేసింది, ఆంధ్ర వలస పాలనలో తెలంగాణ అనే హండ్ బుక్ని రూపొందించి వేలాది మందికి దాన్ని చేర్చింది. బటన్స్, స్టిక్కర్స్ ఇతరత్రా సమాచార సాధనాల ద్వారా తెలంగాణ ఆవశ్యకతను ప్రజల్లోకి తీసుకెళ్లి గెలుపులో కీలక పాత్ర పోషించింది టీడీఎఫ్. ఆల్ పార్టీ మీటింగులు, 150కి పైగా టెలీ కాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్ వంటి సాధనాల ద్వారా ఇటు పొలిటికల్ లీడర్లపై సైతం ఒత్తిడి పెంచుతూ, జర్నలిస్ట్, ప్రొపెసర్లు, ఇరిగేషన్, అగ్రికల్చర్ ఇతర రంగాల మేదావులు, ప్రముఖులతో ప్రత్యేక తెలంగాణ కోసం సమావేశాలు నిర్వహించింది టీడీఎఫ్. పార్టీ ఎజెండా అని మాట్లాడిన సీపీఐ జాతీయ నేత సురవరంతో ధైర్యంగా నిక్సాన్ లాంటి కంపెనీలను చైనాలోకి ఆహ్వానించిన మావో కన్నా గొప్పవారా అని ప్రశ్నించి ఆ పార్టీని తెలంగాణకు అనుకూలంగా మలిచిన ఘనత తెలంగాణ డెవలప్మెంట్ ఫోరంది. అమెరికాలో నిర్వహించే ప్రతీ అటా సమావేశంలో తెలంగాణ వాణిని భలంగా విన్పించింది. తెలంగాణ లబ్ద ప్రతిష్టులతో సెమినార్లు, ప్రజల సందేహాల నివ్రుత్తి వంటి కార్యక్రమాల్ని వరుసగా నిర్వహిస్తూ వచ్చింది టీడీఎఫ్. ఇటు సంస్థాగతంగా నూతన బైలాస్, టాక్స్ ఎక్జెంప్షన్ సౌలభ్యాన్ని తీసుకువచ్చి మరిన్ని ఆర్థిక వనరుల్ని సమకూర్చుకొని మరింత భలంగా మారింది టీడీఎఫ్. అలా తెలంగాణ వ్యాప్తంగా తాగునీటి ప్రాజెక్టులు, ఐ క్యాంప్స్, లైబ్రరీలకు బుక్స్, స్కూళ్లలో మౌళిక వసతుల పెంపు, టాయిలెట్ల ఏర్పాటు, చేనేతలకు సహాయం వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన టీడీఎప్, తెలంగాణ ఏర్పాటు అనంతరం సైతం తన కార్యక్రమాల్ని విస్త్రుత పరిచింది, జైకిసాన్, భారతి వంటి ప్రాజెక్టుల్ని దిగ్విజయంగా నిర్వహిస్తుంది. 2007లోనే అమెరికా యూఎన్ సమావేశాల్లో పాల్గొన్న సోనియా గాంది ముందు బలమైన నిరసన ప్రధర్శన నిర్వహించి ప్రపంచం ద్రుష్టిని ఆకర్షించింది టీడీఎఫ్, జార్జ్ బుష్ ని కలసిన నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ను కలిసి ప్రత్యేక రాష్ట్ర విజ్ణపన పత్రాన్ని అందించింది, అమెరికాలో పర్యటించిన నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఎన్నో సార్లు విజ్ణాపన పత్రాలు ఇచ్చింది, సెయింట్ లూయీస్లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ కి, న్యూజెర్సీ రాయల్ అల్బెట్లో చంద్రబాబుకి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం నిరసనల రుచి చూపించింది. న్యూయార్క్ సిటీలో జరిగిన ఇండిపెండెన్స్, రిపబ్లిక్ డే పెరెడ్లలో తెలంగాణ కోసం ప్లకార్డులు పట్టకొని నిలబడటం. న్యూయార్క్ లో నాలుగు గంటల మౌన ప్రదర్శన ఇలా నాటి నిరసనల తీవ్రత తెలంగాణ అంశాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేసింది. అలా సోనియా మనసులో, యూపీఏ ప్రభుత్వంలో తెలంగాణ ఏర్పాటుపై ఆలోచనల్ని రేకెత్తించింది టీడీఎఫ్. ఇలా అమెరికాలో ఉద్యమం కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్న విద్యార్థులను వద్దని వారిస్తూ ఓయూలో కార్యక్రమాల్ని నిర్వహించింది టీడీఎప్, ఆత్మహత్యలపై 50 ఫీట్ల భానర్ని ఓయూలో ఏర్పాటు చేసింది. అనంతరం ఆత్మహత్యలు చేసుకున్న ఉద్యమకారుల సమగ్ర సమాచారంతో బుక్ లెట్ని ప్రచురించింది. 2009లో కేసీఆర్ దీక్ష కొనసాగుతున్న సమయంలో రాజదాని నడిబొడ్డున టీడీఎప్ సభ్యులు ప్రత్యక్ష నిరసనలు నిర్వహించి అరెస్టయ్యారు, నాడు సమైక్యాంద్ర కుట్రదారుల కుట్రల్ని అనుక్షణం పసిగడుతూ తెలంగాణ ఉద్యమ కారుల్ని అప్రమత్తం చేయడంలో టీడీఎప్ విస్త్రుతమైన నెట్వర్క్ ఎన్నో రకాలుగా విలువైన సమాచారాన్ని అందించింది, డిసెంబర్ 23, 2009లో చిదంబరం నిర్వహించిన అఖిల పక్షంలో టీడీఎఫ్ సైతం పాల్గొన్ని ప్రత్యేక రాష్ట్రం కోసం నినదించింది. నాడు ఢిల్లీలోని ఆంధ్రాభవన్ ముందు జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించింది. ముఖ్యంగా పార్లమెంట్ సౌత్ బ్లాక్ ముందు చరిత్రలో తొలిసారిగా టీడీఎఫ్ నిరసన ప్రధర్శనల్ని నిర్వహించింది. కాన్ట్సిట్యూషనల్ హాల్లోని వలసవాద ఎంపీలకు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అంటే ఏంటో రుచిచూపించింది. సుందరయ్య విజ్ణాన కేంద్రం ముందు అవాకులు, చెవాకులు పేలుతున్న సీమాంద్ర విష పేపర్లను తగలబెట్టింది, సకల జనుల సమ్మేలో బాగస్వామిగా ఉండి 5కే రన్ నిర్వహించింది, ప్రపంచంలోనే తొలిసారిగా ఆధిలాబాద్ టు ఆలంపూర్ వరకు వందల కిలోమీటర్లతో మానవహారాన్ని టీఢీఎఫ్ నిర్వహించింది. ఇటు స్వరాష్ట్రంలోనూ అటు ఖండంతరాల్లోని అమెరికాలోనూ ప్రత్యేక రాష్ట్రం కోసం నిరసనలు చేసింది. నాటి యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన శ్రీక్రుష్ణ కమిటీకి సమగ్ర సమాచారాన్ని అందించింది టీడీఎఫ్. దాదాపు వెయ్యి గ్రామాల ఏకగ్రీవ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తీర్మానాల్ని కమిటీ సభ్యుల్ని ప్రత్యేకంగా కలిసి ఇచ్చి ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతను వివరించారు టీఢీఎఫ్ సభ్యులు. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన టీజేఏసీ ఏర్పాటులో టీడీఎఫ్ పాత్ర అనన్యసామాన్యం, సీఐఐ, ఫిక్కి ఇతరత్రా పారిశ్రామిక సంఘాలను కలుపుకొని గోల్కొండ హోటల్లో సమావేశాలు ఏర్పాటు చేసింది, ఉపఎన్నికల ప్రచారం కోసం ప్రత్యేక బస్సుయాత్రలో టీడీఎఫ్ బాగస్వామ్యం ఉంది, ప్రత్యేకంగా బుక్కులు రూపొందించి ప్రచురించడం, విధ్యార్తి ఉద్యమకారులపై బనాయించిన కేసుల్లో బెయిల్లు ఇప్పించడం, వారికి ఫండింగ్ అందజేయడం, ఇలా ఉద్యమ సమయంలో నిరంతరాయంగా తెలంగాణ కోసం పనిచేస్తూనే ఉంది తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం. ప్రత్యేక రాష్ట్ర బిల్లు పార్లమెంట్ ముందుకు వచ్చినపుడు, ఉబయ సభల ఆమోదం, రాష్ట్రపతి రాజముద్ర వేసేవరకు టీఢీఎఫ్ బ్రుందాలు అనుక్షణం అప్రమత్తంగా ఢిల్లీలో ఉండి అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ ఆలోచనల్ని ఎప్పటికప్పుడు ఉద్యమకారులకు చేరవేస్తూ సంతోష క్షణాలు సాకారమయ్యే వరకూ అలుపులేకుండా శ్రమించింది టీడీఎఫ్. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలు సాకారమై, తెలంగాణ మొత్తం సంబురంగా వేడుకలు చేసుకుంటున్న సమయంలో టీడీఎఫ్ కు చెందిన లక్షలాది కుటుంబాలు ఆనందోత్సాహాలతో సంబరాలు చేసుకున్నాయి, అదే సమయంలో టీడీఎఫ్ ఏర్పాటైన ప్రధాన లక్ష్యం తెలంగాణ థింక్ టాంక్ పాత్రను మరో రూపంలోకి, తెలంగాణ అభివ్రుద్ది ఎజెండాగా చేసుకుంది. 2014లోనే అందుకు కార్యాచరణను రూపొందించింది, వ్యవసాయశాఖ అనుబందంతో వ్యవసాయాన్ని ప్రధాన రంగంగా ఎంచుకొని రైతు ఆత్మహత్యలు తగ్గేలా జైకిసాన్ కార్యక్రమం చేపట్టింది, ఆర్గానిక్ ఫామింగ్, నాచురల్ ఫార్మింగ్, జీరో బడ్జెట్ ఫామింగ్, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్. బయో డైవర్షిఫైడ్ ఫార్మింగ్, ఫార్మర్స్ ఎఫ్.పి.వో మరియు ఎఫ్.ఫి.సి ట్రైనింగ్ వంటి కార్యక్రమాలతో తెలంగాణ లో రైతుల పెట్టుబడి ఖర్చులు గణనీయంగా తగ్గేవిదంగా జిల్లాల వారిగా, మండలాల వారిగా లాబసాటి వ్యవసాయంపై శిక్షణ ఇస్తూ రైతులను ప్రోత్సహిస్తుంది. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని చేసింది టీడీఎఫ్. వీరితో పాటు చేనేతకుటుంబాల స్వావలంబన, ఆదిలాబాద్ కుమ్మరుల సమస్యలు ఇలా తెలంగాణలోని అనేక అంశాలపై కేస్ స్టడీలు నిర్వహిస్తూ పరిష్కార మార్గాల్ని అన్వేషిస్తుంది. అటు విద్యారంగంలోనూ సమూల మార్పులతో మారుమూల తెలంగాణ విద్యార్థుల భవిష్యత్ కు బంగారు బాటలు వేయడానికి మనబడి కార్యక్రమాన్ని చేపట్టింది టీడీఎఫ్. స్కూళ్లలో మౌళిక సదుపాయాలు, డిజిటల్ తరగతులకు పరికరాలు, తాగునీరు, సురక్షిత టాయిలెట్లు ఏర్పాటు చేయడమే కాక, స్కూల్ పిల్లలకు యూనిఫామ్స్, బుక్స్ ఉచితంగా అందిస్తుంది టీడీఎఫ్. హైదరాబాద్ వరదల్లోనూ తన ఉదారత చాటుకుంది టీడీఎఫ్, పెద్ద ఎత్తున సామూహికంగా పుడ్ పాకెట్లను అందించడమే కాక, పునరావాస సెంటర్లకు బ్లాంకెట్లు, ఆహారం ఇతర అవసరాల్ని అందజేసింది. ఆరోగ్య రంగంలో కోవిడ్ మహమ్మారి ప్రభలిన సమయంలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం తన సేవా తత్పరతను చాటుకొంది, ఇటు సహాయం కోసం వాలంటీర్లను రంగంలోకి దించడమే కాక ఫ్రంట్ లైన్ వారియర్లకు అండగా నిలబడింది. మహమ్మారిపై సరైన అవగాహన లేని సమయంలో నిష్ణాతులైన డాక్టర్లను, ఆరోగ్య రంగ నిపుణులను ఏకతాటిపైకి తెచ్చి నిరంతరం సమాచార వ్యాప్తి చేసింది. గ్రామాల స్థాయి వరకూ కట్టడి చర్యల్ని తీసుకెళ్లి కోవిడ్ వ్యాప్తిని అరికట్టడంలో తనవంతు పాత్ర పోషించింది టీడీఎఫ్. ఆరోగ్య కార్యకర్తలకు ప్రభుత్వ బాగస్వామ్యంతో వాక్సినేషన్ అవేర్నెస్ కార్యక్రమాలు, శానిటైజర్లు, మాస్కులు, గ్లోవ్స్, పేస్ షీల్డ్స్, థర్మామీటర్లు, పల్స్ ఆక్సీమీటర్లు అవసరార్థులకు, నిరుపేదలకు ఆక్సీజన్ కాన్సంట్రేటర్లు, సిలిండర్లు, ఆసుపత్రులకు పవర్ క్లీనింగ్ పరికరాలు,బెడ్లు అందజేసింది, రెండోవేవ్లో 2021 కోవిడ్-19 రిలీఫ్ పేరుతో కార్యక్రమాల్ని విస్రుతం చేసింది. వలస కార్మికులకు, వికలాంగులకు, నిరుపేదలకు గ్రాసరీస్ అందజేయడమే కాక ఫాండెమిక్ వల్ల చితికి పోయిన కుటుంబాలకు ఆలంబనగా ఉపాది మార్గాలను అన్వేషించింది టీడీఎఫ్. ఇలా అవసరం ఏదైనా, ఆపత్కర పరిస్థితులైనా అరనిమిషం ఆలస్యం చేయకుండా స్పందించడమే టీడీఎఫ్ సక్సెస్ మంత్ర, ఈ కార్యక్రమాల కోసం నిధుల్ని సైతం తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం సంస్థ సభ్యులే స్వచ్చందంగా సమకూర్చుకోవడం టీడీఎఫ్ ప్రత్యేకత, ఇందుకోసం నిర్వహించే చారిటీ ఈవెంట్స్ వీటికి అధనం మాత్రమే, టీడీఎఫ్ సబ్యులందరు కలిసి డిసెంబర్లో ఘనంగా నిర్వహించుకొనే సంబురం ప్రవాసీ దివస్, 2009లో మొదటి సారిగా ఓయూలో ఉద్యమానికి దన్నుగా నిర్వహించి నాటి ప్రముఖ ఉద్యమకారుల్ని ఆహ్వానించి, దూందాంతో ఉత్సాహాన్ని రేకెత్తించింది, అనంతరం 2010లో వరంగల్లో, 2011 నల్గొండలో, 2012 కరీంనగర్లో, ఐదోసారి 2017న రవీంద్రభారతిలో నిర్వహించిన టీడీఎఫ్. నేడు ఘనంగా 2021లో రవీంద్రభారతిలో ఆరోసారి నిర్వహిస్తుంది. ఈ మహత్కర కార్యాల్లో ఎల్లప్పుడూ చేదోడు వాదోడుగా నిలిచిన తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం సబ్యులకు, ఆఫీస్ బేరర్లకు, కార్యవర్గంలోని ప్రతీ స్థాయి వ్యక్తికి వినమ్రంగా క్రుతజ్ణతాభివందనాలు తెలియజేస్తూ మరోసారి తెలంగాణ ప్రజల సేవలో పునరంకితమవుతుంది తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం. టీడీఎఫ్ ఏర్పాటైనప్పుడు ఏ తెలంగాణ ప్రజలకోసం ఏ లక్ష్యంతో పనిచేస్తుందో ఇప్పటికీ అదే లక్ష్యంతో తన క్రుషిని కొనసాగిస్తూనే ఉంది. ప్రజా ఆకాంక్షలను ప్రతిఫలించే ప్రభుత్వాలకు, ప్రతిపక్షాలకు మాత్రమే మద్దతు తెలుపుతుంది, అలా లేకుంటే ఎవరినైనా ప్రశ్నిస్తుంది టీడీఎఫ్. ఇందులో ఎలాంటి సంకోచాలకు, బేషజాలకు తావులేకుండా పనిచేస్తుంది. రూల్ ఆఫ్ లా పాటిస్తూ పారధర్శకత, సెక్యులరిజమ్ వంటి ప్రజాస్వామ్య పద్దతుల్లో మాత్రమే టీడీఎఫ్ పనిచేస్తుంది. ఈ పరంపరలో తెలంగాణలోని ముఖ్యమైన 20 రంగాల్లో మన భలాబలాలు ఏమిటనే దానిపై సంపూర్ణ అధ్యయనం నిర్వహించింది, వాటి ప్రగతి ప్రణాళికల్ని రచిస్తుంది, దేశంలో, ప్రపంచంలో తెలంగాణ ప్రజల సర్వతోముఖాభివ్రుద్దే ఏకైక ఎజెండాగా తన పని తాను చేసుకుపోతూనే ఉంటుంది తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం. ఇప్పటికీ, ఎప్పటికీ తెలంగాణ ప్రజల పక్షం టీడీఎఫ్.
Jai Telangana
About TDF – India
Jai Telangana
Our Vision
Take up initiatives in area of Education, Health, Agriculture and Women empowerment and serve the deprived communities in Telangana.
Actively volunteer for various causes locally in major US cities in partnership with other Not-for-profit organizations.
TDF-motto is to contribute “Than – Mann – Dhann”
Than: Volunteering for various activities
Mann: Be the think-tank and catalyst, create awareness
Dhan: Financial contribution
TDF members are being highly encouraged to provide community services.
Our Mission
Everyone should have access to basic amenities like Healthy Food, Wealth ,Health, Education, Employment and Livehood.
If you are interested to join TDF, please complete the application form and send it to the address listed on the form.
Our Services
TDF is proving development activities through various projects such as TDF-Jaikisan (Agriculture Project) : • As a part of TDF-Jaikisan Project TDF is executing various programs to farmers of Telangana such Natural Farming trainings, Integrated Farming trainings, Diversified farming trainings, • Digitalization of ancient natural farming methods, spreading of best agriculture methods to farmers through social media platforms, • Financial Support to Farmers families who has committed suicides. • Financial aid to distressed farmers • Providing of Farming inputs such as Local desi seeds, Green manure seeds, Agriculture machinery, Tarpaulin covers, Waste decomposers, Drums for preparing organic fertilizers etc. • Model farm visits for real time training to Farmers, Consumers and students. • Agri Machinery support to farmers through TDF Custom Hiring Center’s. TDF-Arogya Seva (Health care Project): • The main aim of the project is to provide better Health care in rural Telangana. • TDF provided exclusive services during Covid-2019 risking the TDF members and volunteers Life. • Since Cancer cases are increasing day by day TDF is working with various NGO organizations towards preventive healthcare activities by initial cancer screening and Cancer awareness programs. • TDF is providing needed infrastructure to Telangana rural Primary health centre’s and Govt Hospitals in improving needed infrastructure for better health care in rural Telangana. TDF Mana Telangana Badi (Education Project): The main aim of the project is to provide better education in rural Telangana, TDF strongly believes that Education is key to social and economic development and an important instrument for disseminating accomplishments of human civilization. For this TDF is undertaking various programs as a part Mana Telangana Badi project such as • Provision of basic infrastructure to rural Govt schools, • Review of School education policies and advices to Govt of Telangana. TDF Mahila cheyuta (Women empowerment project) : TDF is working towards upliftment of women in rural areas through various projects such as • Trainings to women for live hood such as capacity building, life skills, Entrepreneurship Development Program (EDP), orientation, goat farming, organic manure production, dairy farming, etc TDF Arts and Culture The main aim of the project to preserve Telangana Arts & Culture. With above projects TDF is working for overall upliftment and development of Telangana.